తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహా ప్రతిష్టంభన వేళ ఎన్సీపీపై ప్రధాని పొగడ్తలు - modi latest

రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా పెద్దల సభ ప్రాధాన్యాన్ని సభ్యులకు గుర్తుచేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. భారత రాజ్యాంగ నిర్మాతలు సభా సభ్యులకు గొప్ప భాధ్యతనిచ్చారన్నారు. సంక్షేమ రాజ్యానికే తొలి ప్రాధాన్యమని, అలాగే రాష్ట్రాల సంక్షేమాన్ని చూడటం తమ కర్తవ్యమన్నారు ప్రధాని.

మహా ప్రతిష్టంభన వేళ ఎన్సీపీపై ప్రధాని పొగడ్తలు

By

Published : Nov 18, 2019, 3:36 PM IST

Updated : Nov 18, 2019, 6:40 PM IST

రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. పెద్దల సభ ప్రాముఖ్యాన్ని సభ్యులకు వివరించారు. రాజ్యాంగ నిర్మాతలు సభా సభ్యులకు గొప్ప బాధ్యతను ఇచ్చారని చెప్పారు మోదీ. సంక్షేమ రాజ్యంతో పాటు, రాష్ట్రాలను సంక్షేమమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.

సభలో మాట్లాడుతున్న మోదీ

సభా మధ్యంలోకి వెళ్లకుండానే ప్రజల మనసు గెలుచుకోవచ్చని సభ్యులకు సూచించారు ప్రధాని. సభలో ఇప్పటి వరకు నిరసనలు చేపట్టని నేషనలిస్ట్ కాంగ్రెస్​ పార్టీ​(ఎన్సీపీ), బిజు జనతా దళ్​(బీజేడీ) సభ్యులను అభినందించారు. సభా విలువలను వారు గౌరవించారని కొనియాడారు. భాజపా సహా ఇతర పార్టీలు.. ఎన్సీపీ, బీజేడీలను చూసి సభలో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలని సూచించారు.

రాజ్యసభ రెండో సభా అయినా దేశాభివృధ్దిలో కీలకమని భారత మాజీ ప్రధాని, దివంగత భాజపా నేత అటల్ బిహారీ వాజ్​పేయీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు మోదీ.

ఇదీ చూడండి: లాడెన్​ మృతికి గుండెపోటే కారణమా..?

Last Updated : Nov 18, 2019, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details