మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ సహా మరికొందరు మహాత్ముడికి అంజలి ఘటించారు. అనంతరం అక్కడ జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహాత్మునికి మోదీ, సోనియా ఘన నివాళి - modi
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పలువురు నేతలు నివాళులు అర్పించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బాపూ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
మహాత్మునికి మోదీ, సోనియా ఘన నివాళి
దేశ మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి 115వ జయంతి సందర్భంగా ప్రముఖులంతా అయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.
ఇదీ చూడండి : బాపూ జయంతి: రాహుల్ 'గాంధీ సందేశ్ యాత్ర'
Last Updated : Oct 2, 2019, 9:09 PM IST