తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారిది మేనిఫెస్టో కాదు.. మోసాల పత్రం' - కాంగ్రెస్​ మేనిఫెస్టో

అరుణాచల్​ ప్రదేశ్​ పాసీఘాట్​లో​ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు మోదీ.

కాంగ్రెస్​ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట:మోదీ

By

Published : Apr 3, 2019, 12:42 PM IST

Updated : Apr 3, 2019, 1:25 PM IST

కాంగ్రెస్​ది మోసాల​ మేనిఫెస్టో: ప్రధాని మోదీ
2019 సార్వత్రిక ఎన్నికలు నమ్మకానికి, అవినీతికి మధ్య జరిగే సమరంగా అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఐదేళ్ల పాలనలో ఒక్క రోజూ సెలవు తీసుకోకుండా తాను దేశాభివృద్ధి కోసం కృషి చేసినట్టు మోదీ తెలిపారు.

లోక్​సభతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగే అరుణాచల్​ ప్రదేశ్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాసీఘాట్​లో బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.

కాంగ్రెస్​ పార్టీ మ్యానిఫెస్టో లక్ష్యంగా ప్రధాని విమర్శలు చేశారు. కాంగ్రెస్​ ప్రణాళిక పత్రాన్ని మోసాల పత్రంగా అభివర్ణించారు మోదీ.

"ఒక వైపు ఆశయాలున్న ప్రభుత్వం ఉంది. మరో వైపు కేవలం అసంబద్ధ హామీలు ఇచ్చే వారున్నారు. వీరిలాగే వీరి మేనిఫెస్టో కూడా అవినీతితోనే నిండి ఉంటుంది. అందులో అబద్ధాలు, మోసపూరిత హామీలే ఉంటాయి. అందుకే అది ప్రణాళిక పత్రం కాదు మోసాల పత్రం."
నరేంద్ర మోదీ, ప్రధాని

ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కాంగ్రెస్​ పార్టీకి దశాబ్దాలు పడుతుందని మోదీ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అన్నదాతలకు ఎల్లప్పుడూ తోడుంటే... ఓట్ల కోసం రైతులను హస్తం పార్టీ మభ్యపెడుతోందని మోదీ ఆరోపించారు.

Last Updated : Apr 3, 2019, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details