తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ నిర్ణయంతో పాక్ స్థానమేంటో చూపించిన మోదీ'

ఝార్ఖండ్​లో పర్యటించిన అమిత్​ షా.. మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్టికల్​ 370ని రద్దు చేసి మోదీ.. పాకిస్థాన్​ స్థానమేంటో తెలిపారని వ్యాఖ్యానించారు షా. ఈ అంశంపై రాహుల్​ గాంధీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్​ చేశారు కేంద్ర హోంమంత్రి.

'ఆ నిర్ణయంతో పాక్ స్థానమేంటో చూపించిన మోదీ'

By

Published : Sep 18, 2019, 7:13 PM IST

Updated : Oct 1, 2019, 2:32 AM IST

ఆర్టికల్​ 370ని రద్దు చేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ... పాకిస్థాన్​కు తన స్థానాన్ని చూపించారని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా తెలిపారు. ఝార్ఖండ్​లో 'జోహార్​ జన్​ ఆశీర్వాద్​ యాత్ర'ను ప్రారంభించిన అనంతరం షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీపై విరుచుకుపడ్డారు కేంద్ర హోంమంత్రి. ఆర్టికల్​ 370 రద్దును హస్తం పార్టీ ఎందుకు వ్యతిరేకించిందని ప్రశ్నించిన షా... ఈ అంశంపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ తన వైఖరిని ప్రజలకు తెలపాలని డిమాండ్​ చేశారు.

'ఆ నిర్ణయంతో పాక్ స్థానమేంటో చూపించిన మోదీ'

"ఆర్టికల్​ 370, 35-ఏ లను మోదీ రద్దు చేశారు. కానీ కాంగ్రెస్​ దీనిని ఎందుకు వ్యతిరేకించింది? ఆర్టికల్​ 370ని రద్దు చేయాలని మోదీ పార్లమెంట్​లో బిల్లును తీసుకొచ్చారు. ఓటింగ్​ జరిగింది. కానీ కాంగ్రెస్​ పార్టీ వ్యతిరేకించింది. కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి రద్దు చేయడానికి అనుకూలంగా ఉన్నారా? లేదా వ్యతిరేకిస్తున్నారా? అనే విషయాన్ని రాహుల్​ గాంధీ ఝార్ఖండ్​ వచ్చినప్పుడు స్పష్టం చేయాలి. మేం మెరుపుదాడులు చేస్తాం.. రాహుల్​ గాంధీ వ్యతిరేకిస్తారు. మేం వైమానిక దాడులు చేస్తాం.. ఆధారాలు అడుగుతారు. మీరు ఏ మార్గంలో నడవాలనుకుంటున్నారో ప్రజలకు తెలపండి. "
--- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

ఝార్ఖండ్​ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు షా. రాష్ట్రంలో విద్యుత్​, ఆరోగ్య, గృహ, వంట గ్యాస్​ అనుసంధానాలపై కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ఝార్ఖండ్​ సహా మహారాష్ట్ర, హరియాణాలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:-జైల్లో చిదంబరాన్ని కలిసిన కాంగ్రెస్​ నేతలు

Last Updated : Oct 1, 2019, 2:32 AM IST

ABOUT THE AUTHOR

...view details