తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సంజ్ఞలతో కరోనా జాగ్రత్తలు... ట్వీట్​ చేసిన మోదీ

చేతి సంజ్ఞల ద్వారా ఓ మహిళ కరోనాపై అవగాహన కల్పిస్తున్న వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గుజరాతీలో కరోనా అర్థాన్ని వివరించారు.

Modi shares link on information regarding COVID-19 in sign language
సంజ్ఞలతో కరోనా జాగ్రత్తలు... ట్వీట్​ చేసిన మోదీ

By

Published : Mar 24, 2020, 5:42 AM IST

Updated : Mar 24, 2020, 8:33 AM IST

సంజ్ఞలతో కరోనా జాగ్రత్తలు... ట్వీట్​ చేసిన మోదీ

కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు సాధ్యమైనంత వరకు తెలియజేస్తూనే ఉన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇప్పుడు వైరస్​ సోకకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓ మహిళ సంజ్ఞలతో వివరించిన వీడియోను ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు. 'కొవిడ్​-19 గురించి సంజ్ఞల భాషలో విలువైన సమాచారం' అంటూ లింక్​ను ట్వీట్​ చేశారు​. ప్రాణాంతక వైరస్​ నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కరోనా వైరస్​ను ఎదుర్కోవాలంటే.. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలను సంజ్ఞల ద్వారా వీడియోలో తెలియజేశారు ఓ మహిళ.

గుజరాతీలో కరోనా అర్థం

గుజరాతీలో కరోనా అర్థాన్ని వివరిస్తూ ఓ ట్వీట్​ చేశారు మోదీ. కరోనా అంటే ఎవరు రోడ్లపైకి రావద్దు అని అర్థమని హిందీలోనూ వివరించారు.

భారత్​లో ఇప్పటి వరకు కరోనాతో 9మంది మరణించగా.. 471మంది వైరస్​ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదీ చూడండి:పూర్తి దిగ్బంధంలో భారత్- కేంద్రం కీలక ఆదేశాలు

Last Updated : Mar 24, 2020, 8:33 AM IST

ABOUT THE AUTHOR

...view details