తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీఏఏపై ప్రజలను మోదీ-షా తప్పుదోవ పట్టిస్తున్నారు' - ప్రతిపక్ష నేతల సమావేశం

దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. సీఏఏ, ఆన్​ఆర్​సీపై ప్రజలను మోదీ-షాలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

Modi, Shah misled people on CAA, NRC: Sonia Gandhi
'సీఏఏపై మోదీ-షా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు'

By

Published : Jan 13, 2020, 6:02 PM IST

Updated : Jan 13, 2020, 7:50 PM IST

'సీఏఏపై ప్రజలను మోదీ-షా తప్పుదోవ పట్టిస్తున్నారు'

పౌరసత్వ చట్ట సవరణ, ఎన్​ఆర్​సీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. దేశంలో చెలరేగుతున్న హింసను వారు పట్టించుకోవడం లేదన్నారు.

దిల్లీలోని పార్లమెంట్​ ప్రాంగణంలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో భాగంగా ఈ విధంగా స్పందించారు సోనియా. దేశవ్యాప్తంగా యువత నిరసనలు చేస్తున్నారని.. దీనికి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తోందన్నారు.

"దేశంలో జరుగుతున్న నిరసనలకు ముఖ్య కారణం ఎన్​ఆర్​సీ, సీఏఏ. యువతలో ఉన్న నిరాశ, ఆగ్రహం ఈ ఆందోళనల్లో ప్రతిబింబిస్తున్నాయి. మోదీ-షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వారు చేసిన వ్యాఖ్యలను కొద్ది వారాల ముందు వారే వ్యతిరేకించారు. వివాదాస్పద ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కానీ జాతీయ అనిశ్చితి, హింసపై వారు స్పందించడం లేదు. ప్రజలకు భద్రత కల్పించటంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. "
- సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు.

ఎన్​పీఆర్​తో.. ఎన్​ఆర్​సీ​

అసోంలో ఎన్​ఆర్​సీ విఫలమైనందున, ఇప్పుడు ఎన్​పీఆర్​పై ప్రభుత్వం దృష్టి సారించిందని సోనియా అభిప్రాయపడ్డారు. హోంమంత్రి వ్యాఖ్యలు భిన్నంగా ఉన్నప్పటికీ... దేశవ్యాప్త ఎన్​ఆర్​సీకి ఈ ఎన్​పీఆర్​ దోహద పడుతుందన్నారు.

ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​, ఎల్​జేడీ చీఫ్​ శరద్​ యాదవ్​, వామపక్షాల నేతలు సీతారాం ఏచూరీ, డీ రాజా పాల్గొన్నారు. కాంగ్రెస్​ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్, రాహుల్​ గాంధీ, సీనియర్​ నేతలు గులాం​ నబీ ఆజాద్​, అహ్మద్​ పటేల్ ​ భేటీకి హాజరయ్యారు.

ఇదీ చూడండి:- విపక్షాల భేటీకి బీఎస్పీ, తృణమూల్​, ఆప్​ దూరం

Last Updated : Jan 13, 2020, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details