ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా కలిసి దేశ యువత భవిష్యత్తును నాశనం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, క్షీణించిన ఆర్థిక వ్యవస్థలపై యువత ఆగ్రహిస్తోందని.. అది మరిపించేందుకే వారు పౌరసత్వ చట్ట సవరణ(సీఏఏ), ఎన్ఆర్సీ వంటి చట్టాలు తీసుకొచ్చి దేశాన్ని ముక్కలు చేశారన్నారు. యువత ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు ద్వేషాన్ని ప్రేరేపిస్తున్నారని విమర్శించారు.
దిల్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డ నేపథ్యంలో.. ప్రధాని, హోంమంత్రుని ఓడించాలంటే ప్రతి భారతీయుడు.. మరొకరి పట్ల ప్రేమతో ఉండాలని ట్వీట్ చేశారు రాహుల్.