అభివృద్ధి క్రమక్రమంగా జరుగుతుందిలే అని ప్రజలు ఎదురుచూసే పరిస్థితులు లేవన్నారు ప్రధాని. నవభారత లక్ష్యాలను చేరుకుని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రగతి పథంలో హై జంప్ చేయడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తమ ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని వివరించారు.
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగురువేసిన అనంతరం జాతినుద్దేశించిన ప్రసంగించారు మోదీ.
రూ.100 లక్షల కోట్ల ఖర్చుతో దేశంలో భారీ స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు మోదీ. ఈ చర్యలు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం సాకారానికి సహాయం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
'లక్ష్యం చేరాలంటే హైజంప్ తప్పనిసరి...' సులభతర వాణిజ్య రాంకింగ్లో భారత్ టాప్-50 మార్కను అందుకునేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఉపయోగపడతాయన్నారు ప్రధాని.
ఇదీ చూడండి:- '70 ఏళ్లలో కానిది 70 రోజుల్లో పూర్తి చేశాం'