ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించారు. జగద్గురు విశ్వారాధ్య గురుకుల శతాబ్ది ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వీరశైవం పరిఢవిల్లే కాశీలో గురుకుల శతాబ్ది ఉత్సవాలు జరగడం ఆనందంగా ఉందని చెప్పారు.
శక్తి పీఠాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, 'శ్రేష్ఠ భారత్' నిర్మాణానికి మార్గదర్శకాలు అన్నారు మోదీ.
"21వ శతాబ్దంలో భారత్ తన విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటింది. పూర్వీకులు అందించిన జ్ఞానం వల్లే ఇది సాధ్యమైంది. అందుకు కృషి చేసిన శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకులానికి కృతజ్ఞతలు.