తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఐకమత్యం, ధైర్యంతోనే వైరస్​పై విజయం'

కరోనా వేళ ప్రజలు ధైర్యం కోల్పోకూడదన్నారు ప్రధాని మోదీ. ప్రజలంతా ఐక్యంగా వైరస్​ను ఎదుర్కోవాలని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వాలు వైరస్​ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

modi on corona fight
'సంక్షోభ వేళ ఆత్మ విశ్వాసాన్ని చాటాలి'

By

Published : Jul 10, 2020, 1:14 PM IST

దేశమంతా ఐక్యంగా ఉండి ఆత్మ నిబ్బరాన్ని చాటాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కరోనాపై పోరులో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మధ్యప్రదేశ్​ రేవాలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ పార్కును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన మోదీ.. దేశ ప్రజలందరూ ఐక్యంగా పోరాడి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

కరోనా విజృంభణ వేళ ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు మోదీ. కరోనా నియంత్రణ చర్యలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు.

సంక్షోభం వేళ.. ప్రజలకు సాయం

కరోనా లాక్​డౌన్​ సమయంలో గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా అందించిన ఆర్థిక సాయాన్ని నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు మోదీ. రానున్నది పండుగల కాలం అయినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పీఎం స్వనిధి యోజన ద్వారా వీధి వ్యాపారులకు రూ. 10 వేల చొప్పున రుణసాయం అందిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:దీర్ఘాయువులో 'ప్రాణవాయువు' కీలకపాత్ర

ABOUT THE AUTHOR

...view details