మధ్యప్రదేశ్ ధార్జిల్లా కుక్షి పట్టణానికి చెందిన మహిమారామ్ పాటీదార్(54) అనే వృద్ధుడు.. మూడు నెలల క్రితం హృదయ సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే చికిత్సకు అయిన ఖర్చు మొత్తాన్ని 'ఆయుష్మాన్ భారత్ పథకం' ద్వారా ప్రభుత్వమే భరించింది.
వృద్ధుడి కృతజ్ఞతా ఉత్తరానికి ప్రధాని స్పందన
మధ్యప్రదేశ్‌కు చెందిన 54 ఏళ్ల వృద్ధుడు రాసిన కృతజ్ఞతా ఉత్తరానికి ప్రధాని మోదీ స్పందించారు. ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందినందుకు ఆయనను మోదీ అభినందించారు.
వృద్ధుడి కృతజ్ఞతా ఉత్తరానికి ప్రధాని స్పందన
చేతి గడియారాలను మరమ్మతు చేసుకునే తనకు అనారోగ్యం సమయంలో మోదీ సర్కార్ ఎంతో దన్నుగా నిలిచిందని భావించిన పాటీదార్.. ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశాడు. అసలు ఈ ఉత్తరం మోదీ వరకు చేరుతుందో లేదో అని అనుకున్నాడు. కానీ... అనూహ్యంగా మహిమారామ్కు ప్రత్యుత్తరం వచ్చింది. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగమైనందుకు అభినందిస్తూ స్వయంగా ప్రధానే ఆ లేఖను పంపారు. ఈ స్పందనతో మహిమారామ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్.
ఇదీ చూడండి : 11 సెకన్లలో 100మీ పరుగు-క్రీడామంత్రి ఫిదా
Last Updated : Sep 27, 2019, 8:47 AM IST