తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్​ నైజానికి ప్రతీక' - haryana

కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్రమోదీ. 70 ఏళ్ల పాలనలో చేసిన తప్పులన్నింటికీ మూడు పదాల్లో తేల్చిపారేసిందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హరియాణా రోహతక్​లో ప్రసంగించారు మోదీ.

నమో

By

Published : May 10, 2019, 1:50 PM IST

Updated : May 10, 2019, 2:03 PM IST

70 ఏళ్ల పాలనలో చేసిన తప్పుల నుంచి కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. హరియాణాలోని రోహతక్​లో​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ... కాంగ్రెస్​ నేత శ్యామ్​ పిట్రోడా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

" 70 ఏళ్లు దేశాన్ని కాంగ్రెస్​ ఎలా పాలించిందో... ఆ పార్టీ మెదడు ఎలా పనిచేసిందో... తలలో ఎంత అహంకారం ఉందో మూడు పదాల్లో తేల్చేసింది. అవేంటో తెలుసా? అయ్యిందేదో అయింది. నిన్న కాంగ్రెస్​ పార్టీకి చెందిన పెద్ద నేతల్లో ఒకరు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై మాట్లాడారు. 'ఘటన జరిగింది.. అయ్యిందేదో అయింది' అన్నారు. ఆ నేత ఎవరో తెలుసా? గాంధీ కుటుంబానికి అత్యంత ప్రీతిపాత్రుడు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి: 'పనితీరుపై మాట్లాడలేకనే గతం మాట్లాడుతున్నారు'

Last Updated : May 10, 2019, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details