విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం మారోమారు ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తంచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ... సొంత ప్రయోజనాల కోసమే మహాకూటమి ఏర్పడిందని విమర్శించారు. విపక్షాలకు వారసత్వ రాజకీయాలపై ఉన్న శ్రద్ధ, దేశాభివృద్ధిపై లేదని ఆరోపించారు. ప్రధానమంత్రి పదవి కోసం విపక్ష నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
ఎస్పీ- బీఎస్పీ కూటమిపై ప్రధాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రామ భక్తులను, చౌకీదార్‌ను కించపరిచేలా ఆ రెండు పార్టీల నేతలు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.