తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పారికర్​ లేని లోటు కనిపిస్తోంది'

గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పనాజీ బహిరంగ సభలో ప్రసంగించారు.  రక్షణ రంగంలో కాంగ్రెస్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని మోదీ మండిపడ్డారు.

నరేంద్రమోదీ

By

Published : Apr 10, 2019, 7:56 PM IST

గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ ప్రజల మనిషి అని ప్రధాని నరేంద్రమోదీ కితాబిచ్చారు. ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోవాలోని పనాజీలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు మోదీ. అదే వేదికగా కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మోదీ. రక్షణ రంగంలో భారీ అవినీతికి కాంగ్రెస్ పాల్పడిందని ఆరోపించారు.

నరేంద్రమోదీ

"పార్టీ పనుల కోసం గోవాకు ఎన్నో సార్లు వచ్చా. కానీ ఈ సారి మనోహర్ పారికర్​ మన మధ్య లేరు. ఆయన లేరన్న సత్యాన్ని స్వీకరించాల్సిందే. రక్షణ శాఖను కాంగ్రెస్​ భ్రష్టు పట్టించింది. రక్షణ ఒప్పందాలతో ఆడుకుంది. బోఫోర్స్​లో ముడుపులు తీసుకుంది. ఖత్రోచి విషయంలోనూ అంతే. ఈ పరిణామాలతోనే దశాబ్దాలుగా సైనికులకు ఆధునిక ఆయుధాలు అందలేదు. తండ్రి చేసిన బోఫోర్స్​ పాపం రాహుల్​గాంధీకి భారంగా మారింది. దాన్ని తొలగించుకునేందుకు ప్రపంచంలో అందరి మీద ఆరోపణలు చేస్తున్నారు."

-నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి: శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details