బిహార్‌లో మహా కూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను ప్రధాని నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో విమర్శించారు. బిహార్‌లోని దర్భంగ, ముజఫర్‌పుర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. తేజస్వీ 10 లక్షల ఉద్యోగాల హామీని ప్రస్తావిస్తూ పదునైన వ్యాఖ్యలతో మోదీ ధ్వజమెత్తారు.
"ప్రభుత్వ ఉద్యోగాల గరించి పక్కనపెట్టండి. వాళ్లు అధికారంలోకి వస్తే ప్రైవేట్ ఉద్యోగాలు కూడా పోతాయి. కిడ్నాప్‌లో వారి కుటుంబానికి కాపీరైట్లు ఉన్నాయి. దోపిడీలతో కంపెనీలు మూసేయాల్సి వస్తుంది. అధికారం కోసం ఖాళీ హామీలు ఇస్తున్నారు. తేజస్వీ యాదవ్ బిహార్‌కు కాబోయే యువరాజు కాదు, ఆటవిక రాజ్యానికి రాకుమారుడు.
బిహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే మార్పు వచ్చింది. నితీశ్ ప్రభుత్వం బిహార్‌ను అభివృద్ధి వైపు నడిపించింది. ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దింది. బిహారీల ఆశలను, ఆశయాలను నెరవేర్చేది ఎన్డీఏ మాత్రమే. బిహార్‌ను సమూలంగా మార్చిన పార్టీకి ఓటు వేసే అవకాశం ఇది."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి