తెలంగాణ

telangana

ఐక్యతా దినోత్సవాన్ని మోదీ జరుపుకుంటారిలా..

ఉక్కుమనిషి సర్దార్​ వల్లభ్​​భాయ్​ పటేల్​ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్​ కేవడియాలోని ఐక్యతా విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. పటేల్​ 144వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 'ఏక్​తా దివస్​ పరేడ్'​లో మోదీ పాల్గొంటారు.

By

Published : Oct 31, 2019, 6:36 AM IST

Published : Oct 31, 2019, 6:36 AM IST

Updated : Oct 31, 2019, 7:27 AM IST

ఐక్యతా దినోత్సవాన్ని మోదీ జరుపుకుంటారిలా..

సర్దార్​ వల్లభ్​​భాయ్​ పటేల్​ జయంతి అయిన అక్బోబర్​ 31ని ప్రతి ఏటా ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ రోజున 'ఐక్యతా పరుగు'ను నిర్వహిస్తున్నారు.

గుజరాత్​ అహ్మదాబాద్​ కేవడియాలోని సర్దార్​ ఐక్యతా విగ్రహాన్ని నేడు మోదీ సందర్శించనున్నారు. పటేల్​ జయంతిని పురస్కరించుకొని ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు ప్రధాని. అనంతరం గుజరాత్​ పోలీస్​, కేంద్ర సాయుధ బలగాలు నిర్వహించే 'రాష్ట్రీయ ఏక్​తా దివస్ పరేడ్​'ను వీక్షించనున్నారు. తర్వాత అతిథులు, ప్రజలను ఉద్దేశించిమోదీ ప్రసంగిస్తారు.

ఆ తర్వాత సుమారు 450 మంది సివిల్​ సర్వీసెస్​ ప్రొబేషనర్స్​ను మోదీ కలవనున్నారు. సాయంత్రం వడోదరా విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో తిరిగి దిల్లీ పయనమవుతారు.

ఇదీ చూడండి : 'కమలం'పై ఉమ్మడి పోరుకు కాంగ్రెస్ కసరత్తులు!

Last Updated : Oct 31, 2019, 7:27 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details