ఒడిశాలో విధ్వంసం సృష్టించిన ఫొని తుపాను పశ్చిమ బంగను తాకింది. అక్కడి పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ కేశరి నాథ్ త్రిపాఠితో ఫోన్లో సంభాషించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కేంద్రం అన్ని విధాలా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. బంగాల్ ప్రజలకు అండగా ఉంటామని ట్వీట్ చేశారు మోదీ.
ఒడిశాలో ఫొని సృష్టించిన విధ్వంసం గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఫోన్లో మాట్లాడారు మోదీ. ఒడిశా ప్రజలకు కేంద్రం బాసటగా ఉంటుందన్నారు. గవర్నర్ గనేశీ లాల్తోనూ సంభాషించారు. 'ఫొని'ని ధైర్యంగా ఎదుర్కొన్నారని ప్రజలను కొనియాడారు.