69వ పుట్టినరోజు సందర్భంగా స్వరాష్ట్రం గుజరాత్లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఉదయమే నర్మదా జిల్లాలోని కేవడియాకు చేరుకున్న మోదీ మొదటిగా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు.
ఉద్యానాల సందర్శన
కేవడియా జంగల్ సఫారీ పర్యటక కేంద్రానికి వెళ్లారు మోదీ. అక్కడ కాసేపు విహరించారు. అనంతరం ఖల్వానీ ఎకో టూరిజమ్ కేంద్రాన్ని సందర్శించారు ప్రధాని. అక్కడి అధికారులను పర్యటకానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాక్టస్ గార్డెన్ సహా సీతాకోకచిలుకల ఉద్యాన వనాన్ని సందర్శించారు. కొత్త జాతి సీతాకోక చిలుకలను మోదీ చేతుల మీదగా పార్కులో విడుదల చేశారు.