ఝార్ఖండ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ ఆరోగ్య, సౌభాగ్యాలు కలగాలని ప్రార్థించారు.
ఝార్ఖండ్‌కు మోదీ శుభాకాంక్షలు
ఝార్ఖండ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అక్కడి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆదివాసీ నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. బిర్సా ఎల్లప్పుడు పేదల పక్షానే నిలిచి పోరాటం చేశారని కీర్తించారు.
మరోవైపు, రాష్ట్ర ఆదివాసీ నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు మోదీ. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన కృషి దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఎల్లప్పుడు పేదలు, అణగారిన వర్గాల పక్షానే నిలిచి పోరాటం చేశారని కీర్తించారు.
1875 నవంబర్ 15న అప్పటి బ్రిటీష్ సామ్రాజ్యంలోని ఝార్ఖండ్ ప్రాంతంలో జన్మించారు బిర్సా ముండా. ఆదివాసీలతో కలిసి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. 25 ఏళ్ల యువ ప్రాయంలోనే బ్రిటీష్ కస్టడీలో మరణించారు. 2000 సంవత్సరంలో ఆయన జయంతి రోజునే ఝార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది.