- ప్రధానితో ముగిసిన శరద్‌పవార్ భేటీ
- అరగంట పాటు జరిగిన మోదీ- శరద్ పవార్ భేటీ
- రైతు సమస్యలపై ప్రధానికి 3 పేజీల లేఖ ఇచ్చిన శరద్ పవార్
- వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరిన శరద్ పవార్
- మహారాష్ట్రలో 54 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని మోదీకి వివరించిన పవార్
- మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఉన్నందున కేంద్రం జోక్యం చేసుకోవాలన్న పవార్
- మహారాష్ట్రలో కేంద్రం తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని వినతి
'మహా' భేటీ: ప్రధాని మోదీతో శరద్ పవార్ సమావేశం - pawar latest news
!['మహా' భేటీ: ప్రధాని మోదీతో శరద్ పవార్ సమావేశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5120243-thumbnail-3x2-img.jpg)
14:16 November 20
ప్రధానికి పవార్ మూడు పేజీల లేఖ
12:34 November 20
మోదీతో పవార్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధాని ఛాంబర్లో మోదీని కలిశారు పవార్. మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే... రైతు సమస్యలపై చర్చించేందుకే మోదీని పవార్ కలిశారని చెప్పారు ఎన్సీపీ నేతలు.
12:01 November 20
మరికాసేపట్లో మోదీ-పవార్ 'మహా' భేటీ..
ప్రధాని నరేంద్రమోదీతో పార్లమెంటులో భేటీ కానున్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. మహారాష్ట్ర పరిణామాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. రైతుల సమస్యపై చర్చించేందుకే మోదీని పవార్ కలుస్తున్నారని శివసేన తెలిపింది.