ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఐటీ విభాగ సారథి దివ్యస్పందన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ అనుచరులను ఉద్దేశించి కించపరిచేలా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వివాదాస్పదమైంది.
"మోదీ మద్దతుదార్లంతా అంతే!" - ట్విట్టర్ వార్
ప్రధాని నరేంద్ర మోదీ అనుచరులను కించ పరిచేలా కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ ఐటీ విభాగ సారథి, ఒకప్పటి నటి దివ్యస్పందన ఈ ట్వీట్ చేశారు.
మోదీ
సామాజిక మాధ్యమం వేదికగా మోదీపై ఆమె విమర్శలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతేడాది సెప్టెంబరులో ప్రధానిపై ఆమె చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది.