తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"పాక్ పత్రికల్లో మన ప్రతిపక్షం" - పాక్ ప్రధాన పత్రికలు

పాకిస్థాన్ పత్రికల్లో మన ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలను శీర్షికలుగా ప్రచురిస్తున్నారని ఇది భారత దేశానికి ఏవిధంగా మేలు చేస్తుందని ప్రశ్నించారు ప్రధాని నరేంద్ర మోదీ.

ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు

By

Published : Mar 4, 2019, 11:40 PM IST

గుజరాత్​లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాక్ ప్రధాన పత్రికల్లో మన ప్రతిపక్ష నేతల వ్యాఖ్యల్ని శీర్షికలుగా ప్రచురిస్తున్నారని ఇది దేశానికి ఏవిధంగా మేలు చేస్తోందని ప్రశ్నించారు ప్రధాని మోదీ. నిర్ణయాలు తీసుకోవడంలో తమ ప్రభుత్వం జాప్యం చేయదని తెలిపారు.

వైమానిక దాడులు కేవలం నమూనా మాత్రమేనని అసలు కథ ముందుందని వ్యాఖ్యానించారు మోదీ. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారు కలుగులో దాక్కున్నా వెలికి తీస్తామని హెచ్చరించారు.

ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు

"మన ప్రతిపక్షనేతల వ్యాఖ్యల్ని పాకిస్థాన్ టీవీల్లో చూపిస్తున్నారు. పాక్ పార్లమెంట్​లో చర్చిస్తున్నారు. ఇది దేశ క్షేమంకోసం చేసే పనేనా. మీరు పాకిస్థాన్​కు సంతోషం కలిగించే వ్యాఖ్యలు చేస్తారా..సైన్యం తన సత్తా చాటింది. నేను నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేయను. ఒక్కో దాడికి ప్రతీకారం తీర్చుకోవడం నా స్వభావం. నిర్దోషులను చంపుతుంటే ఎప్పటి వరకు చూస్తూ ఊరుకుందాం.? కొందరు సైన్యం మాటలు సైతం నమ్మరు. మోదీ మాటలను నమ్మకండి..కనీసం సైన్యంపైనైనా విశ్వాసం ఉంచండి. వారి పరాక్రమాన్ని శంఖించకండి. జీవితాల్ని ఫణంగా పెట్టి పోరాడుతున్నారు. ఇది ఎన్నికల స్టంట్ అంటున్నారు. మెరుపు దాడులు చేసినప్పుడు ఏ ఎన్నికలున్నాయి..? ఏళ్లుగా ఉగ్రవాదులు భారత్​పై దాడి చేస్తున్నారు. నిర్దోషులను చంపుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో కూరుకుపోయిన నేతలు చర్యలు తీసుకునేందుకు భయపడిపోయారు. నాకు పదవి ముఖ్యం కాదు. నా చింత అంతా దేశం కోసమే"-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ABOUT THE AUTHOR

...view details