తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా ఎమ్మెల్యే మృతికి ప్రధాని సంతాపం - dantewada

దంతెవాడ మావోయిస్టుల దాడిలో మృతి చెందిన భాజపా ఎమ్మెల్యే భీమా మండావి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భీమా మండావి అంకిత భావం గల భాజపా కార్యకర్తని గుర్తుచేశారు.

భాజపా ఎమ్మెల్యే మృతికి ప్రధాని సంతాపం

By

Published : Apr 9, 2019, 8:32 PM IST

భాజపా ఎమ్మెల్యే భీమా మండావి మృతికి ప్రధాని సంతాపం తెలిపారు. భాజపా అంకితభావం గల ఓ కార్యకర్తని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. మండావి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ దాడిలోమండావితో సహా అసువులు బాసిన అమర జవాన్లకు అండగా నిలుస్తామన్నారు మోదీ. జవాన్ల మృతి వృధాగా పోదన్నారు.

ఎమ్మెల్యే భీమా మండావి వాహనశ్రేణి కువకొండ నుంచి బచేలివైపు వెళ్తుండగా మావోలు దాడి చేశారు. శ్యామగిరి పర్వతాల సమీపంలో శక్తిమంతమైన ఐఈడీ పేల్చారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఎమ్మెల్యే, నలుగురు భద్రతా సిబ్బంది అక్కడికక్కడే మృతిచెందారు.

ABOUT THE AUTHOR

...view details