పేదలు, గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తుందని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కరోనా సంక్షోభంతో సొంతూళ్లకు చేరుకున్న వలస కార్మికులకు తప్పనిసరిగా ఉపాధి కలుగుతుందని భరోసా ఇచ్చారు. వలస కూలీలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో 'గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్'ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించారు.
రూ. 50వేలకోట్లతో అభివృద్ధి..
పేదలు, గ్రామాల అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు మోదీ. కూలీలకు స్వస్థలాలకు సమీపంలో ఉపాధి లభించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. జన్‌ధన్ ఖాతాల్లో రూ.10 వేల కోట్లు జమ చేశామని వెల్లడించారు.