తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రవాదంపై కాంగ్రెస్​ది ఉదాసీనత: మోదీ - మోదీ

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదం పట్ల ఉదాసీనంగా వ్యవహరించిందని ఆరోపించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. తమ వైఖరిని కప్పిపుచ్చుకునేందుకే హిందూ ఉగ్రవాదం అనే అసత్య ఆరోపణను ముందుకు తెచ్చిందని వ్యాఖ్యానించారు.

ఉగ్రవాదంపై కాంగ్రెస్

By

Published : Apr 2, 2019, 11:17 PM IST

Updated : Apr 2, 2019, 11:38 PM IST

విపక్షాలపైప్రధాని నరేంద్ర మోదీవిరుచుకుపడ్డారు. అధికారంలో ఉండగా కాంగ్రెస్​ ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోలేదని మోదీ ఆరోపించారు. బిహార్​లోని గయాలో జరిగిన ర్యాలీలో మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదంపై విచారణను తప్పుదోవ పట్టించేందుకు హిందూ ఉగ్రవాదం అనే ఆరోపణను ముందుకు తెచ్చిందని విమర్శలు చేశారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశం నలుమూలలా బాంబు దాడులు జరిగేవన్నారు మోదీ. సంఝౌతా ఎక్స్​ప్రెస్ బాంబు పేలుడు కేసులో స్వామి అసీమానంద సహా మిగతా నిందితులందరికీ ఎన్​ఐఏ కోర్టు క్లీన్​ చిట్ ఇచ్చిందని గుర్తు చేశారు.

ఉగ్రవాదంపై కాంగ్రెస్​ది ఉదాసీనత: మోదీ

''మహాకూటమికి కాపాలాదారులు, ఛాయ్​వాలా, పారిశుద్ధ్య కార్మికులంటే ద్వేషం. సొంత బలంతో ముందుకు సాగేవాళ్లతో వారికి సమస్య. అందుకే వారు చౌకీదార్​పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి సైనికులు స్లీపర్​ సెల్స్​ను పట్టుకుంటే, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రమాదకర ఉగ్రవాదుల్ని మహాకూటమి వదిలేసింది. విపక్షాల ఆలోచనే ఉగ్రవాదులు భారత్​లో బలపడేలా చేసింది. వేలమంది ప్రాణాలు పోయేందుకు కారణమయింది.''- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

Last Updated : Apr 2, 2019, 11:38 PM IST

ABOUT THE AUTHOR

...view details