తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాపలాదారుడిగా దేశ ఖజానాను సంరక్షిస్తా' - మోదీ

అన్నదాతలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. దేశంలో కాంగ్రెస్​పై వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు న్యాయం కోరుకుంటున్నారని అన్నారు. తనకు కాపలాదారుడి పని ఇస్తే దేశ ఖజానాపై ఎవరి కన్ను పడకుండా చూసుకుంటానని 'ఈనాడు ముఖాముఖి'లో మోదీ స్పష్టం చేశారు.

'కాపలాదారిడిగా దేశ ఖజానాను భద్రపరుస్తా'

By

Published : Apr 9, 2019, 7:58 AM IST

Updated : Apr 9, 2019, 9:01 AM IST

రైతులకు మేమున్నాం...

అసత్య ప్రచారాల వల్లే దేశంలో పలు చోట్ల రైతుల ఆందోళనలు జరిగాయని ప్రధాని మోదీ అన్నారు. నిజాలు తెలిసిన వెంటనే అన్నదాతల్లో విశ్వాసం పెరిగిందని స్పష్టం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కృషి చేస్తునట్టు వెల్లడించారు మోదీ. ఈ మేరకు వ్యవసాయానికి అనుబంధ రంగాలను ప్రోత్సహించడానికి నిర్ణయించినట్టు తెలిపారు. అన్నదాతను సౌరవిద్యుత్తుతో అనుసంధానించి ఇంధనశక్తి ప్రదాతను చేస్తామని తెలిపారు. సౌర విద్యుత్​ వాడకం వల్ల కలిగే లాభాలపై రైతుల్లో అవగాహన పెంచుతామన్నారు. తేనె ఉత్పత్తిని ప్రోత్సహించి, కోళ్లు, చేపలు, పశువుల పెంపకందారులకు మద్దతిస్తామని చెప్పారు. ప్రజల్లో ఆరోగ్యంపై ఆసక్తి పెరగడం వల్ల సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్​ పెరిగిందని మోదీ అన్నారు. సిక్కిం తొలి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా రికార్డులకెక్కిందని గుర్తిచేశారు. హిమాలయ, ఈశాన్య రాష్ట్రాలను సేంద్రియ వ్యవసాయ రాజధానిగా చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నామని తెలిపారు.

రైతులకు మేమున్నాం...

న్యాయం కోసం కాంగ్రెస్​ను నిలదీస్తున్నారు...

దేశవ్యాప్తంగా కాంగ్రెస్​పై వ్యతిరేకత ఉందని ప్రధాని తెలిపారు. ఎన్నికల్లో గెలిస్తే ఉద్యోగాలిస్తామని రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ యువతకు కాంగ్రెస్​ తప్పుడు వాగ్దానం చేసిందని ఆరోపించారు మోదీ. రైతులకు రుణమాఫీ చేస్తామంటూ కర్ణాటక, పంజాబ్​ సహా ఆ మూడు రాష్ట్రాలను మోసం చేసిందని మండిపడ్డారు. 2009లో రైతులకు రూ.6లక్షల కోట్ల అప్పులుంటే అప్పట్లో యూపీఏ ప్రభుత్వం రూ.51వేల కోట్లు మాత్రమే మాఫీ చేసిందని విమర్శించారు. అందులోనూ 35-40 లక్షల ఖాతాలు తప్పుడువని కాగ్‌ తేల్చిందని అన్నారు. దేశ నలుమూలల్లో ఉన్న ప్రజలు తమకు న్యాయం జరగాలని కాంగ్రెస్​ను డిమాండ్​ చేస్తున్నట్టు ప్రధాని తెలిపారు. దేశప్రజల ప్రశ్నలకు కాంగ్రెస్​ వెంటనే జవాబు చెప్పాలని మోదీ సూచించారు.

న్యాయం కోసం కాంగ్రెస్​ను నిలదీస్తున్నారు...

కాపలాదారు పని ఇప్పించండి...

ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో నాశనం చేస్తామని ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు పాలు, నీళ్లు, తిండి దొరుకుతుంటే ఎలా అంతరించిపోతారని... వారికి నష్టం కలిగించడానికి ఎంతటి ధైర్యవంతమైన నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధమని అన్నారు. జాతీయ భద్రత కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం కాదని మోదీ స్పష్టం చేశారు. దేశభక్తితో, దేశం కోసం చేస్తున్నట్టు తెలిపారు. తనకు దేశ కాపలాదారు పని అప్పగిస్తే దేశ ఖజానాపై ఎవరి చేయి పడకుండా చూస్తానని వాగ్దానం చేశారు ప్రధాని. భారత దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి, ప్రజల అభివృద్ధిలో తోడ్పాటు అందిచడం, రక్షణ కల్పించడమే తన ధ్యేయమని మోదీ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

'సొంతంగానే మెజార్టీ సాధిస్తాం- సుస్థిర పాలన అందిస్తాం'

రఫేల్​పై మాకు ప్రతీచోటా క్లీన్​చిట్​: మోదీ
'అసత్యాల ప్రచారమే విపక్షాల అజెండా'
'సొంతంగానే మెజార్టీ సాధిస్తాం- సుస్థిర పాలన అందిస్తాం'
'రమణ్​ సింగ్​ను చూసి బాబు నేర్చుకోవాలి'

కాపలాదారు పని ఇప్పించండి...

ఇదీ చూడండీ : 'పాక్​ జెట్​ కూల్చివేత నిజమే- ఇవిగో సాక్ష్యాలు'

Last Updated : Apr 9, 2019, 9:01 AM IST

ABOUT THE AUTHOR

...view details