తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మత్తుతో చిత్తే... అందుకే ఈ-సిగరెట్లపై నిషేధం' - నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మన్​ కీ బాత్​ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొగాకు వల్ల కలిగే నష్టాలను దేశ ప్రజలకు వివరించారు ప్రధాని. ప్రముఖ గాయని లతా మంగేష్కర్​కు ఫోన్​లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

'మత్తుతో చిత్తే... అందుకే ఈ-సిగరెట్లపై నిషేధం'

By

Published : Sep 29, 2019, 11:56 AM IST

Updated : Oct 2, 2019, 10:43 AM IST

దేశ ప్రజలనుద్దేశించి మన్​-కీ-బాత్​లో ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఐరాస సర్వసభ్య సమావేశాలు ముగించుకుని శనివారమే స్వదేశానికి చేరుకున్న ఆయన.. నేడు మన్-​కీ-బాత్​ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శనివారమే 90వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ప్రముఖ గాయని లతా మంగేష్కర్​కు స్వయంగా ఫోన్​ చేశారు మోదీ. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఓ వైపు.. 'డెలివరీ-ఇన్'​ పద్ధతిలో స్వీట్లు, గిఫ్ట్స్​ ఇంటికి తెచ్చుకుంటున్న మనం.. మరోవైపు 'డెలివరీ ఔట్​' గురించి కూడా ఆలోచించాలన్నారు ప్రధాని. మన ఇంట్లో అవసరం లేని, అలాగే అధిక మొత్తంలో ఉన్న వాటిని డెలివరీ ఔట్​కు కేటాయించాలన్నారు.

పొగాకు వినియోగం వల్ల వచ్చే వ్యాధుల గురించి కూడా ప్రస్తావించారు మోదీ. యువతను మత్తుపదార్థాలకు దూరంగా ఉంచాలన్న ఆలోచనతోనే ఈ-సిగరెట్లపై నిషేధం విధించినట్లు చెప్పారు ప్రధాని.

"పొగాకుకు బానిసగా మారడం ఆరోగ్యానికి ఎంతో హానికరం. అలాగే దాని బారి నుంచి బయటపడటం చాలా కష్టం. పొగాకు వినియోగిస్తున్న వారికి క్యాన్సర్​, డయాబెటిస్​, రక్తపోటు వంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. ఈ-సిగరెట్లపై ప్రజలకు చాలా తక్కువ అవగాహన ఉంది. వాటి ద్వారా వచ్చే హాని గురించి ప్రజలకు పూర్తిగా తెలియదు."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

Last Updated : Oct 2, 2019, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details