కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్డౌన్ మరో 2 రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యచరణపై చర్చించేందుకు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. లాక్డౌన్ కొనసాగింపు, కార్యాచరణపైనే ప్రధానంగా చర్చించారు. స్వల్ప సడలింపులతో మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించే అంశంపై సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. మే 3న లాక్డౌన్ గడువు తీరిపోనుండగా.. ఒక్కరోజు ముందు జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించే అవకాశాలున్నాయి.
దేశంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపైనా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను అడిగి తెలుసుకున్నారు ప్రధాని. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దూరప్రాంతాల వారిని రైళ్లలో తరలించే విషయంపైనా మోదీ చర్చించారు.
నిరంతరం సమీక్ష...