బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికగా చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇరుదేశాల మధ్య మైత్రి నూతన దిశ-నవీన శక్తితో సాగుతోందని అభిప్రాయపడ్డారు. నెల వ్యవధిలోనే జిన్‌పింగ్‌ను మరోసారి భేటీ కావడం సంతోషంగా ఉందన్నారు. చెన్నై వేదికగా జరిగిన అనధికారిక సమావేశం ఇరుదేశాల సంబంధాల్లో నూతన శకానికి నాంది పలికిందన్నారు మోదీ.
"చెన్నైలో మన భేటీ ద్వారా నవోత్సాహం వచ్చింది. ఏ ఎజెండా లేకుండా జరిగిన నాటి భేటీలో ఇరుదేశాల సంస్కృతులు, అలవాట్లు సహా పరస్పరం అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఆ భేటీ ఎంతో సత్ఫలితాలనిచ్చింది. చెన్నై సమావేశంలో చర్చించిన ద్వైపాక్షిక వాణిజ్య అంశాలు ఆచరణలోకి వస్తే ఇరు దేశాలకు సంబంధించి అనేక అంశాలు మరింత ముందుకు సాగుతాయి."