తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా మహిళా ఎంపీలతో మోదీ భేటీ - breakfast

భాజపా మహిళా పార్లమెంటు సభ్యులతో ప్రధాని నరేంద్రమోదీ ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఎంపీలతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు మోదీ.

భాజపా మహిళా ఎంపీలతో మోదీ భేటీ

By

Published : Jul 12, 2019, 1:24 PM IST

నూతనంగా ఎన్నికైన భాజపా పార్లమెంటు సభ్యులతో విడతల వారీగా భేటీ అవుతున్నారు ప్రధాని నరేంద్రమోదీ. తాజాగా మహిళా ఎంపీలతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. అల్పాహార విందు ఇచ్చారు.

పార్టీ ఎంపీలందరినీ 7 బృందాలుగా విభజించారు. ఒక్కో బృందంతో ఒక్కోసారి భేటీ అవుతున్నారు మోదీ. ఇప్పటికే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, గతంలో మంత్రులుగా పనిచేసిన ఎంపీలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ప్రస్తుతం భాజపా నుంచి గెలిచిన 41 మంది మహిళా ఎంపీలు హాజరయ్యారు.

ఆ ఇద్దరు మంత్రులూ..

మోదీతో ఎంపీలు నేరుగా సమస్యలను వినిపించేందుకు ఇదో చక్కని వేదికని పార్టీ భావిస్తోంది. ఈ సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి కూడా భాగమయ్యారు.

గత 16వ లోక్​సభ సమయంలో పార్లమెంటు సమావేశాలకు ముందు రాష్ట్రాల వారీగా ఎంపీలతో భేటీ అయ్యేవారు మోదీ.

ఇదీ చూడండి: 'భారత వాయుసేనలో రఫేల్​ మరో గేమ్​ ఛేంజర్​'

ABOUT THE AUTHOR

...view details