తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వలస కూలీల కష్టం కలచివేసింది : మోదీ - modi mann ki bat on recent issues

modi mann ki bat
మరికాసేపట్లో మోదీ 'మన్​కీ బాత్' కార్యక్రమం

By

Published : May 31, 2020, 11:04 AM IST

Updated : May 31, 2020, 12:12 PM IST

12:03 May 31

కరోనా వేళ.. వలస కార్మికుల కష్టాలు వర్ణనాతీతమని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. వారి కష్టం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. మన్​కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. వలసకూలీల కోసం  శ్రామిక్ రైళ్లను నడుపుతున్నామని గుర్తు చేశారు. వారి కష్టాలను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్టార్టప్​ సంస్థలు, పరిశ్రమ వర్గాల ద్వారా స్థానికంగానే పనికల్పించేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తామని ఉద్ఘాటించారు.  

అనుక్షణం అప్రమత్తంగా..

వైరస్​పై పోరులో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రధాని. కరోనాపై దేశ ప్రజలంతా పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఈ పోరాటాన్ని మరింత సమర్థంగా కొనసాగించాలని ఉద్ఘాటించారు. పేద ప్రజలు, శ్రామికులపై లాక్​డౌన్ ప్రభావం తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.

భారత్.. నిబ్బరంగా నిలవాలి

ఆత్మ నిర్భర్ భారత్​ పథకం దేశాన్ని మరో శ్రేణికి తీసుకెళ్తుందని ఉద్ఘాటించారు మోదీ. కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందని చెప్పారు. రైల్వే, విమాన ప్రయాణాలను పాక్షికంగా ప్రారంభించినట్లు చెప్పారు.

ఆయుష్మాన్ భారత్​తో పేదలకు మేలు

ప్రస్తుత కరోనా వేళ.. ఆయుష్మాన్ భారత్ పథకం పేద ప్రజల పట్ల వరంగా మారిందన్నారు ప్రధాని. పేదల డబ్బును ఉచిత చికిత్స పథకం ఆదా చేస్తోందని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోటిమంది నిరుపేదలు చికిత్స పొందారని.. ఇందులో 80 శాతం మంది గ్రామీణులేనని వెల్లడించారు.

అంపన్, మిడతలపై పోరు..

అంపన్ తుపాను ద్వారా తీవ్రంగా నష్టపోయినా రైతులు ధైర్యంగా నిలిచారని ఉద్ఘాటించారు మోదీ. మిడతలు భారత్​కు మరో ముప్పుగా పరిణమించాయని.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం వాటిని పారదోలేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

యోగా విలువ చాటుదాం..

కరోనా వేళ ప్రపంచ నేతలు ఆయుర్వేదంపై ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు మోదీ. శ్వాస వ్యవస్థను కరోనా దెబ్బతీస్తుందని.. కానీ యోగాలోని ప్రాణాయామం ద్వారా దీన్ని అధిగమించవచ్చునని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తున్న వేళ రోగ నిరోధక శక్తి పెంపునకు యోగా ఎలా సాయపడుతుందో చాటాలని పేర్కొన్నారు. 'మై లైఫ్.. మై యోగా' బ్లాగ్ ద్వారా యోగా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రధాని.

నవీన ఆవిష్కరణలతో కరోనా కట్టడి

నూతన ఆవిష్కరణల ద్వారానే కరోనాను కట్టడి చేయగలమని చెప్పారు మోదీ. కరోనా సమయంలో ఎందరో కొత్తకొత్త ఆవిష్కరణలు చేశారని చెప్పారు. కరోనా కట్టడి కోసం అన్ని రంగాల ప్రజలు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. మాస్కులు తయారుచేసి మహిళాసంఘాలు ఆవిష్కరణలు చేశాయని.. చిన్న పరిశ్రమలు, అంకుర సంస్థలు, విద్యారంగంలోని వారు వైరస్​ కట్టడికి తమ వంతు ప్రయత్నం చేశారన్నారు.

పర్యావరణ పరిరక్షణ దిశగా

పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు ప్రధాని. ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచేందుకు ముందుకు రావాలని చెప్పారు. పక్షులు, జంతువులు ప్రకృతిలో భాగమని అర్థం చేసుకోవాలని సూచించారు. వానాకాలం సందర్భంగా వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని వెల్లడించారు.

11:28 May 31

  • అంఫన్ తుపాను ద్వారా తీవ్రంగా నష్టపోయినా రైతులు ధైర్యంగా నిలిచారు: మోదీ
  • మిడతలు భారత్​కు మరో ముప్పుగా పరిణమించాయి.. ప్రభుత్వా వాటిని పారదోలే ఏర్పాట్లు చేస్తుంది: మోదీ
  • వానాకాలం సందర్భంగా వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి: మోదీ
  • పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటండి: మోదీ

11:18 May 31

  • ఆత్మ నిర్భర్ భారత్​ ఈ దశాబ్దంలో దేశాన్ని మరో శ్రేణికి తీసుకెళ్తుంది: మోదీ
  • కరోనా వేళ ప్రపంచ నేతలు ఆయుర్వేదంపై ఆసక్తి చూపుతున్నారు: మోదీ
  • అంతర్జాతీయ యోగా దినోత్సవం సమీపిస్తున్న వేళ రోగ నిరోధక శక్తి పెంపునకు యోగా ఎలా సాయపడుతుందో చాటాలి: మోదీ
  • 'మై లైఫ్.. మై యోగా' బ్లాగ్ ద్వారా యోగా పోటీలు.. ప్రపంచంలోని ఎవరైనా పాల్గొనవచ్చు: మోదీ

11:13 May 31

  • కరోనా కాలంలో విద్యార్థులు, అధ్యాపకులు వీడియో ద్వారా వీడియో క్లాసులు నిర్వహించడం అభినందనీయం: మోదీ
  • నవీన కల్పనల ద్వారానే వైరస్​ను ఎదుర్కోగలం: మోదీ
  • దేశానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి, వాటిని ఎదుర్కోవడంలో సమర్థంగా పోరాడుతున్నాం: మోదీ
  • కరోనా ప్రభావం.. పేదలు, శ్రామికవర్గాలపై అధికంగా ఉంది: మోదీ
  • అంతా ఏకమై వైరస్​ను పారదోలుదాం: మోదీ
  • రైల్వేలు కూడా కరోనా యోధులే: మోదీ
  • దేశాన్ని నూతన శిఖరాలకు చేర్చడంలో అందరి భాగస్వామ్యం ఉంది: మోదీ
  • వలసకార్మికుల కష్టాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయాలు వెతకాల్సి ఉంది: మోదీ
  • భారత గ్రామాలు సాధికారత సాధించాలి: మోదీ

11:06 May 31

  • భవిష్యత్తులో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి: మోదీ
  • కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది: మోదీ
  • ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలి: మోదీ
  • పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు: మోదీ
  • కరోనా కాలంలో ఇతరులకు చేయూత అందించిన వారికి అభినందనలు: మోదీ

10:37 May 31

మోదీ 'మన్​కీ బాత్'

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్​ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాక్​డౌన్ 5.0 పై కేంద్రం ప్రకటన వెలువడాల్సి ఉన్న నేపథ్యంలో ప్రధాని కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. వైరస్​ ప్రభావం నుంచి దేశం కోలుకునేందుకు తీసుకున్న చర్యలపై ప్రధాని ప్రజలకు వివరించే అవకాశం ఉంది.

మోదీ 2.0 ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన దృష్ట్యా గతేడాది సాధించిన విజయాలను ప్రధాని గుర్తు చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా ఇటీవలి నెలకొన్న పరిణామాలపై చర్చిస్తారని సమాచారం.

Last Updated : May 31, 2020, 12:12 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details