తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే ధ్యేయం-ఒకే దిశ : నరేంద్రమోదీ - మోదీ

జాతీయవాదమే భాజపాకు స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 2047 వరకు భారత్​ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టడమే లక్ష్యమని పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఒకే ధ్యేయం-ఒకే దిశ:నరేంద్రమోదీ

By

Published : Apr 8, 2019, 1:46 PM IST

Updated : Apr 9, 2019, 7:14 AM IST

భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో 75 లక్ష్యాల్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని నిర్దేశించుకున్నామన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. స్వాతంత్ర్యం వచ్చి 100ఏళ్లు అయ్యే 2047లోగా అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడాలని పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇందుకోసం 'ఒకే ధ్యేయం-ఒకే దిశ' నినాదంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.

అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా మేనిఫెస్టో విభిన్న పార్శ్వాలతో ఉంటుందన్నారు. ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు చేసే కంటే పేదరికంపై పోరాటం చేస్తామన్నారు మోదీ. గత ఐదేళ్ల పాలనలో ప్రజలకు అవసరమైన వాటిని చేశామని, ప్రస్తుతం వారి ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

ఒకే ధ్యేయం-ఒకే దిశ:నరేంద్రమోదీ

"మేం దేశాన్ని సుసంపన్నం చేసేందుకు, సామాన్యుల సాధికారత కోసం, ప్రజల భాగస్వామ్యం పెంపొందిస్తూ... ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవిస్తూ.. చివరి లబ్దిదారు వరకు ఫలాలు అందేలా పనిచేసేందుకు 'ఒకే ధ్యేయం-ఒకే దిశ' నినాదంతో ముందుకు సాగటమే మంత్రంగా భావిస్తున్నాం. అలాగే.. మన సమాజం విభిన్నమైంది. భాష, జీవనశైలి, విద్యావిధానం ఇలా అనేక రకాలుగా భిన్నత్వం ఉంది. ఒకే బెత్తంతో అందరినీ సంభాళించలేం. అందుకే వివిధ దిశల్లో అభివృద్ధిని చేయాలని నిర్ణయించాం. గ్రామీణులైనా, నగరవాసులైనా, సమాజంలోని వివిధ వర్గాలైన ప్రతి ఒక్కరి ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రయత్నించాం. విభిన్న పార్శ్వాల్లో అభివృద్ధిని కొనసాగిస్తాం. ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ దృష్టి కేంద్రీకరిస్తూ ముందుకు సాగుతాం."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

Last Updated : Apr 9, 2019, 7:14 AM IST

ABOUT THE AUTHOR

...view details