బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ.. కోల్కతా పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీతో ఇవాళ భేటీ కానున్నారని ఆ రాష్ట్ర సచివాలయ అధికారి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం, శనివారం సాయంత్రం 4 గంటలకుప్రధాని.. నగరానికి చేరుకున్న వెంటనే ఇరువురు నేతలు రాజభవన్లో సమావేశమవుతారని ఆయన స్పష్టం చేశారు.
అజెండా ఏమిటి?
ప్రధాని మోదీ, బంగాల్ సీఎం మమత బెనర్జీల మధ్య జరగనున్న ఈ కీలక భేటీకి సంబంధించిన అజెండాను మాత్రం ఆ ఉన్నతాధికారి వెల్లడించలేదు.