తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్..​ మునిగిపోతున్న టైటానిక్​ ఓడ : మోదీ - ప్రధాని నరేంద్ర మోదీట

కాంగ్రెస్ పార్టీని మునిగిపోతున్న టైటానిక్​ ఓడగా అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోదీ. విపత్కర పరిస్థితిలో ఉన్న ప్రతిసారి ప్రజలకు తప్పుడు హామీలిచ్చి మభ్య పెడుతోందని ఆరోపించారు. మహారాష్ట్ర నాందేడ్​లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని.

ప్రధాని మోదీ ప్రసంగం

By

Published : Apr 7, 2019, 2:21 AM IST

Updated : Apr 7, 2019, 6:34 AM IST

అమేఠీలో ఓడిపోతాననే భయంతోనే మైనారిటీలు ఎక్కువగా ఉన్న వయనాడ్​ను రెండో స్థానంగా రాహుల్​ గాంధీ ఎంచుకున్నారని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న టైటానిక్ ఓడ లాంటిదని ఎద్దేవా చేశారు.

2014లో 44 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్​కు ఈసారి అవి కూడా దక్కవని విమర్శించారు మోదీ. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మోసపూరిత హామిలిచ్చి, ఆ తర్వాత వాటిని విస్మరించడం కాంగ్రెస్​కు అలవాటే అని వ్యాఖ్యానించారు.

పేదలకు న్యాయ్ పథకంతో న్యాయం చేస్తామని చెబుతున్న కాంగ్రెస్, దాన్ని అమలు చేసేందుకు ప్రజలపైనే పన్నుల భారం మోపడం తథ్యమని చెప్పారు ప్రధాని మోదీ.

ప్రధాని మోదీ ప్రసంగం

" కాంగ్రెస్​ పరిస్థితి ముగిపోతున్న టైటానిక్​ ఓడలా తయారైంది. రోజులు గడిచే కొద్దీ మునిగిపోతూనే ఉంది. కాంగ్రెస్​తో జత కట్టిన ఎన్సీపీ వంటి పార్టీలదీ అదే పరిస్థితి. మునిగిపోకుండా తప్పించుకునేందుకు బయటపడేందుకు కొన్ని పార్టీలు పరుగులు పెడుతున్నాయి. " -- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

Last Updated : Apr 7, 2019, 6:34 AM IST

ABOUT THE AUTHOR

...view details