తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ డూప్​'కు ఎన్నికల సంఘం నోటీసులు - మోదీ

మోదీ పోలికలతో ఉన్న వ్యక్తి అభినందన్​ పాఠక్ లోక్​సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 'ఒక నోటు- ఒక ఓటు' తన ఎన్నికల నినాదమని ప్రకటించారు. స్పందించిన అధికారులు... ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద తాఖీదులు జారీచేశారు.

'మోదీ డూప్​'కు ఎన్నికల సంఘం నోటీసులు

By

Published : Apr 14, 2019, 7:21 AM IST

'మోదీ డూప్​'కు ఎన్నికల సంఘం నోటీసులు

ప్రధాని నరేంద్రమోదీ పోలికలతో ఉండే అభినందన్​ పాఠక్​... ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్​ వేశారు. మోదీ పోటీ చేసే వారణాసిలోనూ పోటీ చేస్తానని ప్రకటించారు.

" ఈ నెల 26న వారణాసి స్థానానికి నామినేషన్​ వేస్తాను. రెండు స్థానాల నుంచి గెలుపొందేందుకు నా శాయశక్తులా కృషిచేస్తాను. నేను డమ్మీ అభ్యర్థిని కాదు. ఎవరికి అమ్ముడుపోలేదు. ఎవరి ముందు తలవంచలేదు. ప్రజల ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉంటుంది. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం రాహుల్​ గాంధీని ప్రధాని చేసేందుకు మద్దతు ఇస్తాను."
- అభినందన్​ పాఠక్, స్వతంత్ర అభ్యర్థి

తన ఎన్నికల నినాదం ' ఒక ఓటు, ఒక నోటు' అని చెప్పారు అభినందన్​. స్పందించిన లఖ్​నవూ జిల్లా మెజిస్ట్రేట్​ కౌశల్​ రాజ్​ శర్మ నోటీసులు జారీ చేశారు. అభినందన్​ వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని తాఖీదుల్లో పేర్కొన్నారు.

మోదీ శైలి దుస్తులే ధరిస్తారు అభినందన్. ప్రధాని తరచుగా ప్రసంగాల్లో ఉపయోగించే మిత్రోం(స్నేహితులారా) పదంతోనే మాటను ప్రారంభిస్తారు.

ABOUT THE AUTHOR

...view details