తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అస్పష్టంగానే ముగిసిన భారత్​-చైనా మేజర్ జనరల్స్ భేటీ - india china firing

india-china live updates
జై​శంకర్​తో సంభాషించిన చైనా విదేశాంగ మంత్రి..

By

Published : Jun 17, 2020, 3:16 PM IST

Updated : Jun 17, 2020, 9:36 PM IST

21:15 June 17

ముగిసిన మోదీ, రాజ్​నాథ్​ల​ భేటీ

ప్రధాని మోదీతో రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్ భేటీ ముగిసింది. భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ, రాజ్​నాథ్ సింగ్​... తదుపరి భారత్ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

21:02 June 17

గాల్వన్​లో ముగిసిన భారత్​ చైనా మేజర్ జనరల్స్ సమావేశం

తూర్పు లద్దాక్​లోని​ గాల్వన్​ లోయ వద్ద భారత్​-చైనా మేజర్ జనరల్స్ చేపట్టిన చర్చలు ముగిశాయి. ఈ సమావేశంలో సరిహద్దు సమస్య పరిష్కారంపై ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే రానున్న రోజుల్లో ఇరుదేశాల మధ్య మరిన్ని చర్చలు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.

20:40 June 17

ప్రధానితో మరోసారి రాజ్​నాథ్​ భేటీ..

భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తతల వేళ ప్రధాని నరేంద్ర మోదీతో మరోసారి భేటీ అయ్యారు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​. 

20:25 June 17

నిలకడగా ఆరోగ్యం...

గాల్వాన్​ లోయ హింసాత్మక ఘటనలో తీవ్రంగా గాయపడ్డ నలుగురు ఆర్మీ సిబ్బంది పరిస్థితి నిలకడగా ఉనట్టు సమాచారం. ఈ ఘటనలో ఇప్పటివరకు 20మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

19:41 June 17

చర్చలను స్వాగతిస్తున్నాం..

"వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించడానికి విదేశాంగ మంత్రుల చర్చలతో పాటు ఇరు దేశాలు తీసుకున్న చర్యలను మేము స్వాగతిస్తున్నాం. అంతా సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం."

                --- నికోలేయ్​ కుదషేవ్​, భారత్​లోని రష్యా రాయబారి.

19:17 June 17

సునీల్​ కుమార్​కు నివాళి

బిహార్​ రాజధాని పాట్నా విమానాశ్రయంలో హవల్దార్​ సునీల్​ కుమార్​కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్​ మోదీ, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సంజయ్​ జస్వాల్​, ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​ నివాళులర్పించారు. సోమవారం రాత్రి గాల్వన్​ లోయలో భారత్​-చైనా బలగాల మధ్య చెలరేగిన ఘర్షణలో సునీల్​ కుమార్​ అమరుడయ్యాడు.

19:04 June 17

రష్యా స్పందన

భారత్​-చైనా సరిహద్దు పరిస్థితులను ప్రపంచ దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇరు దేశాలు సంయమనం పాటిస్తూ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అనేక దేశాలు కోరుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై రష్యా స్పందించింది.

"సమస్యను పరిష్కరించుకోవడానికి మిలిటరీ స్థాయి ప్రతినిధులు రంగంలోకి దిగినట్టు ఇప్పటికే ఇరు దేశాలు వెల్లడించాయి. ఉద్రిక్త పరిస్థితులను తొలగించేందుకు చర్చలు జరుపుతున్నాయి. దీనిని మేము స్వాగతిస్తున్నాం."

                     --- సర్గేయ్​ లావ్రోవ్​, రష్యా విదేశాంగమంత్రి.

18:54 June 17

రాష్ట్రపతి స్పందన

గాల్వన్​ ఘటనపై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ స్పందించారు.

సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా.. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడటానికి భారత సైనికులు చూపించిన ధైర్యం, అత్యున్నత త్యాగానికి నేను నమస్కరిస్తున్నాను. గాల్వన్​ లోయలో ప్రాణాలు అర్పించిన వారందరూ భారత సాయుధ దళాల సంప్రదాయాన్ని నిలబెట్టారు.

               ---- రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

18:15 June 17

శాంతియుత పరిష్కారం దిశగా...

  • ఫోన్‌లో మాట్లాడుకున్న భారత్, చైనా విదేశాంగ మంత్రులు
  • గాల్వన్‌లో హింసాత్మక ఘర్షణలు, జవాన్ల మృతిపై నిరసన తెలిపిన జైశంకర్
  • గాల్వన్‌లో నిర్మాణాలకు చైనా యత్నించడమే వివాదాలకు కారణమన్న జైశంకర్‌
  • హింసకు దారితీసేలా ప్రణాళిక ప్రకారం చైనా చర్యలు తీసుకుందన్న జైశంకర్‌
  • అన్ని ఒప్పందాలు ఉల్లంఘిస్తున్నారన్న విదేశాంగమంత్రి జైశంకర్‌
  • క్షేత్రస్థాయిలో వాస్తవాలు మార్చాలనే ఉద్దేశం కనిపిస్తోందన్న జైశంకర్‌
  • జూన్ 6న మిలిటరీ కమాండర్ స్థాయిలో డీఎస్కలేషన్ నిర్ణయం జరిగిందన్న జైశంకర్
  • ఈ మేరకు సైనికులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రోటోకాల్స్ తప్పక పాటించాలి: జైశంకర్‌
  • గ్రౌండ్ కమాండర్స్ స్థాయిలో నిత్యం చర్చలు చేస్తున్నారన్న జైశంకర్‌
  • దీనిపై సమన్వయం చేసుకోవాలని నిర్ణయం జరిగిందన్న జైశంకర్‌
  • ఇలాంటి చర్యలు ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయన్న జైశంకర్‌
  • చైనా తనవైపు నుంచి చేపట్టిన కార్యకలాపాలపై పునరాలోచించాలి: జైశంకర్‌
  • చైనా నిర్ణయాలు, చర్యలను వివరించిన ఆదేశ విదేశాంగమంత్రి వాంగ్ యీ
  • జూన్ 6 నాటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఇరుదేశాల తుదినిర్ణయం
  • శాంతి సాధన దిశగా కలిసి కృషిచేయాలని నిర్ణయం తీసుకున్న విదేశాంగమంత్రులు

17:24 June 17

పక్కా ప్రణాళిక ప్రకారమే: జైశంకర్​

గాల్వన్​ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదనీ.. పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిన ఘటనగా పేర్కొన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్​. ఘటనకు చైనా బాధ్యత వహించాలని చెప్పినట్లు సమాచారం. చైనా విదేశాంగ మంత్రి జైశంకర్​తో ఫోన్​లో సంభాషించగా ఈ వ్యాఖ్యలు చేశారు. 

16:48 June 17

సంయమనం పాటించాలి: ఈయూ

  • భారత్‌ - చైనా సరిహద్దు ఘర్షణలపై స్పందించిన ఐరోపా సమాఖ్య
  • చర్చల ప్రక్రియను భారత్‌ - చైనా కొనసాగించాలి: ఐరోపా సమాఖ్య
  • సరిహద్దు వివాదంపై ఇరుదేశాలు సంయమనం పాటించాలి: ఐరోపా సమాఖ్య
  • సైనిక ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరుదేశాలు కృషి చేయాలి: ఐరోపా సమాఖ్య
  • సరిహద్దుల్లో శాంతిస్థాపనకు పరిష్కారం కనుక్కోవాలి: ఐరోపా సమాఖ్య
  • పరస్పర విశ్వాసం పెంపొందించుకునేందుకు ఇది కీలక సమయం: ఐరోపా సమాఖ్య

16:47 June 17

చర్చల ద్వారానే పరిష్కారం: చైనా

  • పరిష్కారం దిశగా సరిహద్దుల్లో ఘర్షణల వివాదం: చైనా విదేశాంగశాఖ
  • శాంతియుత పరిష్కారానికి ఇరుదేశాల సూత్రప్రాయ అంగీకారం: చైనా విదేశాంగశాఖ
  • సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు కృషి: చైనా విదేశాంగశాఖ
  • ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: చైనా విదేశాంగశాఖ

16:25 June 17

జై​శంకర్​తో సంభాషించిన చైనా విదేశాంగ మంత్రి..

భారత్​-చైనా సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై​శంకర్​తో ఫోన్​లో సంభాషించారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ. ఈ మేరకు ఓ ప్రకటన వెలువడింది. 

సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చించారు. ఘర్షణకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని భారత్​ను కోరినట్లు ఓ వార్తా పత్రిక వెల్లడించింది. 

15:41 June 17

సోనియా గాంధీ కీలక వ్యాఖ్య..

భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై స్పందించారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. సరిహద్దు వెంట భారత భూభాగాన్ని చైనా ఎలా ఆక్రమించుకుందో, భారత సైనికులు ఎందుకు అమరులయ్యారో ప్రధాని చెప్పాల్సినఅవసరం ఉందని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో దేశం, సైనికుల వెంటే కాంగ్రెస్​ ఉంటుందని స్పష్టం చేశారు. సమష్టిగా శత్రువును ఎదుర్కోవాలని అన్నారు.  

15:12 June 17

అమర వీరులకు మోదీ నివాళి

అమరవీరులకు నివాళి

తూర్పు లద్దాక్​​లోని గాల్వన్​ లోయ ఘటనలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ముఖ్యమంత్రులతో సమావేశం ప్రారంభానికి ముందు మోదీ మౌనం పాటించారు.

  • చైనాతో సరిహద్దు వివాదంపై స్పందించిన ప్రధాని మోదీ
  • సైనికుల త్యాగాలను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించిన ప్రధాని
  • ప్రధాని మోదీతో పాటు మౌనం పాటించిన ముఖ్యమంత్రులు

సైనికుల త్యాగాలు ఎన్నటికీ మరువలేము: ప్రధాని మోదీ

భారత సార్వభౌమాధికారంపై రాజీపడే ప్రసక్తే లేదు: ప్రధాని మోదీ

సైనికుల త్యాగాలు వృథాగా పోవని దేశానికి హామీ ఇస్తున్నా: ప్రధాని మోదీ

ఈనెల 19న అఖిలపక్ష సమావేశం: ప్రధాని మోదీ

దేశ, ఐక్యత సార్వభౌమాధికారం అత్యంత ప్రాధాన్యతాంశాలు: ప్రధాని

భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది: ప్రధాని

ఎవరైనా రెచ్చగొడితే దీటుగా బదులు ఇవ్వడానికి సిద్ధం: ప్రధాని

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉంది: ప్రధాని

Last Updated : Jun 17, 2020, 9:36 PM IST

ABOUT THE AUTHOR

...view details