తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశానికి సౌర వెలుగులు.. అతిపెద్ద విద్యుత్​ ప్రాజెక్టు ప్రారంభం - తొలి సౌర విద్యుత్ పార్క్

మధ్యప్రదేశ్​ రేవాలో ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ పార్కును ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. అనంతరం ప్రాజెక్ట్​ను జాతికి అంకితం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ.

modi
తొలి సౌర విద్యుత్ పార్క్ ప్రారంభం

By

Published : Jul 10, 2020, 11:51 AM IST

Updated : Jul 10, 2020, 12:01 PM IST

మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ పార్కును జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని. మధ్యప్రదేశ్‌ రేవా వద్ద రూ.4,500 కోట్లతో 750 మెగావాట్ల సామర్థ్యంతో ఈ సౌర విద్యుత్ పార్కు ఏర్పాటు చేశారు.

సౌర విద్యుత్ పార్కులోని 3 విభాగాల్లో 250 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. ఈ ప్రాజెక్టులో 24 శాతం విద్యుత్‌ను దిల్లీ మెట్రోకు సరఫరా చేయనున్నారు. మిగతా 76 శాతాన్ని రాష్ట్ర విద్యుత్ సంస్థకు అందిస్తారు.

కేంద్ర సహకారంతో..

దేశంలో ఇది మెుట్టమెుదటి సౌర విద్యుత్‌ ప్రాజెక్టు. 2022కి గాను గిగావాట్​ పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతోపాటు 100 గిగావాట్ల సౌర విద్యుత్​ను సాధించేందుకు భారత్​ కట్టుబడి ఉందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

రేవా అల్ట్రా మెగా సోలార్​ లిమిటెడ్​ (ఆర్​యూఎంఎస్​ఎల్​), మధ్యప్రదేశ్​ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్​, భారత సోలార్​ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ పార్క్​ను నిర్మించాయి. ఈ సోలార్‌ పార్క్‌ను అభివృద్ధి చేయటానికి కేంద్ర ప్రభుత్వం రేవా సోలార్‌ కంపెనీకి రూ.138 కోట్లు అందించింది.

ఇదీ చూడండి:నేటి అవసరం.. డిజిటల్‌కు అనుసంధానం!

Last Updated : Jul 10, 2020, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details