తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"కాంగ్రెస్​ హిందూ సంస్కృతిని అవమానించింది" - narendra modi

కాంగ్రెస్​పై తీవ్ర ఆరోపణలు చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశంలో ప్రాచీన మత సంస్కృతికి అపకీర్తి తలపెట్టేందుకే హిందూ తీవ్రవాదాన్ని కాంగ్రెస్​ తెరపైకి తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్​ ఖండ్​వాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మోదీ. ఆ రాష్ట్రంలో 2.5 ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నారని విమర్శించారు.

"కాంగ్రెస్​ హిందూ సంస్కృతిని అవమానించింది"

By

Published : May 12, 2019, 9:13 PM IST

దేశంలో హిందూ సంస్కృతికి అపకీర్తి తలపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అందుకే హిందూ తీవ్రవాదాన్ని సృష్టించారని విమర్శించారు. కాంగ్రెస్​ పాలనలో జరిగిన సిక్కుల మారణకాండపై జరిగిందేదో జరిగిపోయిందని ఆ పార్టీ నేతలు బాధ్యత లేకుండా వ్యాఖ్యానించారన్నారు ప్రధాని. మధ్యప్రదేశ్​ ఖంఢ్​వా ఎన్నికల ర్యాలీలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

"కాంగ్రెస్​ హిందూ సంస్కృతిని అవమానించింది"

"1984లో సిక్కుల ఊచోకోత జరిగింది. కాంగ్రెస్​ నేతలు జరిగిందేదో జరిగిందని తేలికగా మాట్లాడుతున్నారు. మహాకూటమి, కిచిడీ ప్రభుత్వాలు రక్షణ అందించలేవు. మధ్యప్రదేశ్​లో 2.5 సీఎం అధికారంలో ఉన్నారు. ఎవరి ఆదేశాలు పాటించాలో ప్రభుత్వ యంత్రాంగానికి తెలియదు. గూండాలు, హంతకులు, నేరస్థులకు పూర్తి స్వేచ్ఛ లభించింది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి: ఓటు బాధ్యత మరువని వరుడు...

ABOUT THE AUTHOR

...view details