శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సతో భేటీకి ముందు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్ష కోసం ఎదురుచూస్తున్నాని తెలిపారు.
కరోనా అనంతర కాలంలో ఇరు దేశాలు సహకారాన్ని మరింతగా పెంచుకునే మార్గాలను అన్వేషించాలని అన్నారు. ఇరుదేశాధినేతల భేటీకి సంబంధించి రాజపక్స చేసిన ట్వీట్‌పై ఈ విధంగా స్పందించారు మోదీ.