తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ పుస్తకాన్ని.. రాహుల్​కు అందజేస్తా'

ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలకు సంబంధించిన పుస్తకాన్ని దిల్లీ భాజపా అధ్యక్షుడు ఆదేశ్​ గుప్తా ఆవిష్కరించారు. మోదీ నాయకత్వంలో భారత్​ ఎంత బలమైన దేశంగా అవతరించిందో ఈ పుస్తకం స్పష్టం చేస్తోందని అన్నారు. దీన్ని నిత్యం విమర్శించే కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీకి ఇస్తామని తెలిపారు

'Modi India Calling-2021': New coffee table book chronicles PM Modi's foreign tours
'ఈ పుస్తకాన్ని రాహుల్​కు అందజేస్తా'

By

Published : Jan 9, 2021, 10:51 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ పర్యటనల చిత్రాలను కలిపి ముద్రించిన 'మోదీ ఇండియా కాలింగ్​-2021' అనే పుస్తకాన్ని ప్రవాస భారతీ దివాస్​ సందర్భంగా దిల్లీ భాజపా అధ్యక్షుడు ఆదేశ్​ గుప్తా విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని దేశ రాజధానిలోని ప్రెస్​క్లబ్​ ఆఫ్ ఇండియాలో ఆవిష్కరించారు. ప్రధాని మోదీ ఏడు ఖండాల్లో చేసిన పర్యటనల నుంచి సేకరించిన ఫోటోలను ఇందులో పదిల పరిచినట్లు భాజపా సీనియర్ నాయకుడు విజయ్​ జాలీ తెలిపారు. ఇందులోని ప్రధాని పర్యటనలు.. భారత్​ను ఎంత శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దాయో వివరిస్తాయన్నారు. మోదీని నిత్యం విమర్శించే కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీకి, దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​కు బహూకరిస్తానని అన్నారు.

మోదీ ప్రధానమంత్రి అయ్యాక భారతీయ విదేశాంగ విధానం స్వరూపాన్నే మార్చేశారని దిల్లీ భాజపా అధ్యక్షుడు ఆదేష్​ గుప్తా తెలిపారు. ఈ పుస్తకాన్ని చదివితే పాఠకులకు ఆ విషయం భోదపడుతుందన్నారు. ఇలాంటి దాన్ని తీసుకువచ్చినందుకు గాను జాలీకి కృతజ్ఞతలు చెప్పారు.

ప్రవాస భారతీ దివాస్​ను 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్​ బిహారీ వాజ్​పేయీ ప్రారభించారు. భారత ప్రభుత్వానికి​, ప్రవాస భారతీయుల మధ్య సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జాతిపిత మహాత్మా గాంధీ 1915లో దక్షణాఫ్రికానుంచి తిరిగి వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని అన్​లైన్ వేదికగా నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: మోదీ ఐదేళ్ల విదేశీ పర్యటనల ఖర్చు రూ.446 కోట్లు

ABOUT THE AUTHOR

...view details