భారత్‌లో దేశభక్తి, జాతీయవాదంపై కొందరు నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాననమంత్రి నరేంద్ర మోదీ. పశ్చిమ్ బంగాల్లోని బైరకపురలో ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేవారితో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
వందేమాతర గీతాన్ని రాసిన మహనీయుడు జన్మించిన నేలపైనే.. ఇప్పుడు ఆ గీతాన్ని ఓట్ల కోసం వక్రీకరిస్తున్నారని విమర్శించారు.
"ఈ నేల మీద జన్మించిన ఎందరో మాహానుభావుల వల్లే ఈరోజు భారత్‌కు ప్రపంచ ఖ్యాతి లభించింది. కానీ ఏ దేశభక్తినైతే ఈ నేల ప్రోత్సహించిందో... అదే దేశభక్తిపై నిందలు పడుతున్నాయి. ఓటుపై ఉన్న భక్తితో కొందరు దేశభక్తిని పక్కనపెడుతున్నారు. భరతమాతను కీర్తించడానికి, వందేమాతం.. అనేందుకు వందసార్లు ఆలోచిస్తున్న వారితో బంగాల్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
తృణమూల్ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు మోదీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్, భారత సైన్యాన్ని ఆ పార్టీ ఎన్నడూ గౌరవించలేదని ఆరోపించారు. ఇప్పుడు సైనికుల ధైర్య సాహసాలనూ ప్రశ్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీ.
ఇదీ చూడండి: 'సైకిల్‌కి వేశాం.. కమలం వచ్చింది'