తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ నాకు వారణాసితో సమానం: మోదీ - KERALA

వారణాసి అంటే ఎలాంటి ఆత్మీయత ఉందో కేరళతోనూ అంతే అనుబంధం ఉందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కేరళ పర్యటనలో భాగంగా గురువాయూర్​లో భాజపా అభినందన సభకు హాజరయ్యారు మోదీ. భాజపా అఖండ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

కేరళ నాకు వారణాసితో సమానం: మోదీ

By

Published : Jun 8, 2019, 1:37 PM IST

ప్రజల నాడిని పసిగట్టడంలో రాజకీయ పార్టీలు, నిపుణులు విఫలమయ్యారని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ప్రభంజన విజయాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

కేరళ పర్యటనలో భాగంగా గురువాయూర్​లో భాజపా ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు మోదీ. కేరళ తనకు వారణాసితో సమానమని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ప్రత్యేక స్థానముందని, విజయం సాధించిన వారు 130 కోట్ల మంది ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు ప్రధాని. విజయాన్ని అందించినా, అందించకపోయినా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టంచేశారు.

సభలో మాట్లాడుతున్న మోదీ

"రాజకీయ పార్టీలు ప్రజల నాడిని పసిగట్టలేకపోయాయి. రాజకీయ పండితులు ప్రజా తీర్పును ఊహించలేకపోయారు. సర్వేలు నిర్వహించిన వారు అటు ఇటుగా అంచనా వేశారు. ప్రజలు మాత్రం భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకు అఖండ విజయాన్ని అందించారు. కొంత మంది రాజకీయ పండితులు విచారం వ్యక్తం చేస్తున్నారు.... 'కేరళలో భాజపా ఖాతా తెరవలేదు. అయినా అభినందన సభకు మోదీ అక్కడికి వెళ్తున్నారు.' అని అనుకుంటున్నారు. మోదీ ఆలోచన ఏంటో వారికి అర్థం కావడం లేదు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.

ఇదీ చూడండి: 'అసత్య, విద్వేష ప్రచారంతోనే వారి విజయం'

ABOUT THE AUTHOR

...view details