భారత పర్యటనలో ఉన్న శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే.. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన రెండు దేశాల ప్రతినిధుల స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి జయ్‌శంకర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో పరస్పర సహకారంపై ఈ సమావేశంలో చర్చించారు ఇద్దరు నేతలు.
మోదీ-రాజపక్సే సరికొత్త స్నేహగీతం - జాతీయ వార్తలు తెలుగు
ప్రధాని నరేంద్రమోదీతో శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్సే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన రెండు దేశాల ప్రతినిధుల స్థాయి చర్చల్లో వాణిజ్య, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు.
మోదీ-రాజపక్సే
అంతకు ముందు రాజపక్సేకు రాష్ట్రపతి భవన్‌లో సంప్రదాయ స్వాగతం లభించింది. రాజపక్సేకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. అనంతరం సైనిక దళాలు ఆయనకు గౌరవ వందనం సమర్పించాయి. భారత పర్యటనలో భాగంగా రాజపక్సే... వారణాసి, బోధ్‌గయా, సార్‌నాథ్, తిరుమలకు వెళ్లనున్నారు.
Last Updated : Feb 29, 2020, 3:23 PM IST