నక్సలైట్లను ప్రోత్సహించేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇలాంటి మేనిఫెస్టోలతో అధికారం చేపట్టిన వారు ఆదివాసీల జీవితాల్లో అలజడి సృష్టిస్తారని ఆరోపించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కొర్బ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మోదీ. నీరవ్ మోదీ, లలిత్ మోదీని ప్రస్తావిస్తూ రాహుల్ చేసిన విమర్శలను తప్పుబట్టారు.
'మోదీలందరూ దొంగలే అనడం తగునా?'
"విమర్శలు చేయడానికి ఏదో ఒకటి మాట్లాడటం నామ్‌దార్‌కు ఫ్యాషన్ అయిపోయింది. మోదీలందరూ దొంగలే అని ఇటీవలే ఆరోపించారు. గుజరాత్ వాసులనూ 'మోదీ' అనే అంటారు. మరి అక్కడి వారందరూ దొంగలేనా? ఇలాంటి మాటలు ఆయనకు మంచి చేస్తాయా? ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా?"
--- నరేంద్ర మోదీ, ప్రధాని.
ఇదీ చూడండి: గబ్బర్‌సింగ్‌ను భయపెట్టిన డైలాగ్ తెలుసా..?