అమెరికాలో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమంపై కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రచారం చేసి.. స్వయంగా ప్రధానమంత్రే భారతదేశ విదేశాంగ విధానాన్ని ఉల్లంఘించారని మండిపడింది. భారత విదేశాంగ విధానం ప్రకారం మరొక దేశంలో జరిగే ఎన్నికల్లో జోక్యం చేసుకోకూడదని హస్తం పార్టీ నేతలు ఆరోపించారు. నరేంద్ర మోదీ పక్షపాత ధోరణితో దీర్ఘకాల భారత్- అమెరికా వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతినే అవకాశముందని ఆరోపించారు.
గౌరవనీయులైన ప్రధాని.. మరొక దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోకూడదనే భారత విదేశాంగ విధానాన్ని మీరు ఉల్లంఘించారు. ఈ చర్య వల్ల దీర్ఘకార భారత ప్రయోజనాలను నాశనం చేశారు.
-ఆనంద్ శర్మ, కాంగ్రెస్ సీనియర్ నేత