స్వాతంత్ర్యం అనంతరం తొలిసారి జీడీపీ వృద్ధి అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోతుందనే హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 'మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే' అంటూ ఎన్నికల నాటి భాజపా నినాదాన్ని ప్రయోగిస్తూ ట్వీట్ చేశారు.
1947 తర్వాత జీడీపీ వృద్ధి కనిష్ఠ స్థాయికి చేరుకుంటుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను ట్వీట్‌కు జతచేశారు.