లాక్డౌన్ తర్వాత ఓ వైపు కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటం, మరోవైపు పెట్రోల్ రేట్లను పెంచుతుండంటంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు రాహుల్ గాంధీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. పెట్రోల్, డీజిల్ ధరలను, కరోన వైరస్‌ను అన్‌లాక్ చేశారని ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్‌తో పాటు కొవిడ్-19కు సంబంధించిన వివరాలతో రేఖా చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు రాహుల్. కరోనా కేసులు మాత్రమే పెరగటం లేదూ.. అంటూ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. లాక్డౌన్ తర్వాత రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుదలతో పాటు చమురు ధరలు స్థిరమైన పెరుగుదలను ఈ రేఖా చిత్రం సూచిస్తోంది.