దేశంలో నిరుద్యోగ సమస్యపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోదీ సర్కార్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.
యువత తరఫున తాను అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భయపడకుండా సమాధానం ఇవ్వాలని ట్వీట్ చేశారు రాహుల్.
"దేశంలోని యువత ఉద్యోగాలు కోరుకుంటున్నారు. మీ ప్రభుత్వం ఆ విషయంలో ఘోరంగా విఫలమైంది.