తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భద్రతా దళాల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది'

దిల్లీలో సీఆర్​పీఎఫ్​ నూతన ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేంద్రమంత్రి అమిత్​ షా. ఈ నేపథ్యంలో కేంద్ర భద్రతా బలగాల కుటుంబాల సంరక్షణకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Modi govt determined to take care of families of central security forces personnel: Amit Shah
'భద్రతా దళాల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది'

By

Published : Dec 29, 2019, 3:36 PM IST

కేంద్ర భద్రతా దళాల కుటుంబాల సంరక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. దిల్లీలో సీఆర్​పీఎఫ్​ నూతన ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు షా. ప్రతీ పారామిలిటరీ సిబ్బంది తమ కుటుంబాలతో 100రోజుల సమయం గడిపేలా అవకాశం కల్పిస్తామని తెలిపిన కేంద్ర హోంమంత్రి.. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని స్పష్టం చేశారు. జవానుల కుటుంబాలకు ఆరోగ్య కార్డులు జారీ చేస్తామన్నారు.

సీఆర్​పీఎఫ్ నూతన భవనం

దిల్లీలోని లోధీ రోడ్​లో ఉన్న సీబీఐ ప్రధాన కార్యాలయం పక్కనే.. నూతన సీఆర్​పీఎఫ్ ప్రధాన కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. 2.23 ఎకరాల స్థలంలో రూ.277 కోట్లతో భవన నిర్మాణం చేయనున్నారు. 2022 నాటికి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపట్టేలా కేంద్ర ప్రజా పనుల విభాగాన్ని(సీపీడబ్ల్యూడీ) ఆదేశించారు.

నూతన భవనంలో 11(జీ+) ఫ్లోర్లు, ఆడిటోరియం, కాన్ఫరెన్స్ హాల్, సబార్డినేట్ సిబ్బందికి శిబిరాలు, కేంద్ర పోలీస్ క్యాంటీన్, జిమ్నాసియం, గెస్ట్ రూం, కిచెన్, డైనింగ్ రూమ్​, 520 కార్లు, 15 బస్సుల సామర్థ్యంతో పార్కింగ్ స్థలాన్ని నిర్మించనున్నారు. 6, 7వ అంతస్తులలో స్కైవాక్​లను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. మురుగు నీటి శుద్ధి సహా వర్షపు నీరు సేకరణ వంటి అధునాతన వ్యవస్థలు ఉండేలా ప్రతిపాదించారు.

ప్రస్తుత సీఆర్​పీఎఫ్​ కార్యాలయం లోధీ రోడ్​లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్​లో ఉంది. అయితే సీఆర్​పీఎఫ్ కోబ్రా, ఆర్​ఏఫ్ విభాగాలు, ఇతర సౌకర్యాలు రాజధానిలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. అన్ని వసతులు ఒకే చోట ఉండేలా నూతన కార్యాలయాన్ని రూపొందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details