ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా.. రైతులు, కూలీలు, చిన్నస్థాయి వ్యాపారులను పట్టించుకోకుండా.. ఆరేళ్లుగా అసంఘటిత ఆర్థిక వ్యవస్థను మోదీ నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఫలితంగా రానున్న రోజుల్లో ఉద్యోగాలు సృష్టించలేని పరిస్థితిలో దేశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని 22 జిల్లాల్లో కాంగ్రెస్ కార్యాలయాల నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు రాహుల్. ఈ నేపథ్యంలో.. దేశంలోని 90శాతం ఉద్యోగాలు అసంఘటిత ఆర్థిక వ్యవస్థతోనే వస్తాయని రాహుల్ గుర్తుచేశారు. కానీ నోట్ల రద్దు, జీఎస్టీ విధానాలతో వాటిని మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని మండిపడ్డారు.
ఇదీ చూడండి:-'పీఎం కేర్స్ నిధులపై సుప్రీం తీర్పు రాహుల్‌కు చెంపపెట్టు'
వ్యవస్థీకృత, అసంఘటిత ఆర్థిక వ్యవస్థల మధ్య సమానతలు ఉండటం ఎంతో ముఖ్యమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వీటిని సమానంగా గుర్తిస్తున్నట్టు తెలిపారు.